మెంతి గోంగూర

కావలిసిన వస్తువులు 

గోంగూర                   :  ఒక కిలో
మెంతుల పొడి          : 100 గ్రాములు
నూనె                        : 200 గ్రాములు
ఎండుమిరపకాయలు  :  50 గ్రాములు
ఆవాలు                  : 50 గ్రాములు
కారం                      : 250 గ్రాములు
ఇంగువ                  : చిటికెడు
పోపుగింజలు           : సరిపడా
ఉప్పు                    :  సరిపడా
పసుపు                  :  సరిపడా

తయారుచేయు విధానం 

1) గోంగూరను శుభ్రంగా కడిగి, బాగా ఆరాబెట్టాలి .
2)  తరువాత దానిని నూనెలో వేయించాలి .
3) అందులో ఉప్పు పసుపు, మెంతిపొడి కలుపుకొవలి.
4) మరల నూనె కాచి ఎండుమిరకాయలు, ఆవాలు, పోపుగింజలు వేయించాలి.
5) దీనిని గోంగూర లో పోసి బాగా కలిపి చల్లారిన తరువాత జాడీలో పెట్టుకోవాలి. 

వంకాయ ఇగురు * రుచి - అభిరుచి


కావలిసిన వస్తువులు

వంకాయలు          :   అర  కిలో
ఉల్లిపాయలు           :     4
పచ్చిమిర్చి            : 6
కరివేపాకు             : సరిపడా
పసుపు                 : కొద్దిగా
కారం                     : రెండు స్పూనులు
నూనె                     : 100 గ్రాములు
ఆవాలు                  :  ఒక స్పూను
ఉప్పు                     : సరిపడా

తయారువిధానం :

1)  వంకాయలు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకోవాలి.
2)  ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, కరివేపాకు వేసి వేపాలి.
3)  తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలుపోసి అవి కూడా వేగిన తరువాత వంకాయ ముక్కలను అందులో    వేసి, ఉప్పు, పసుపు కూడా వేసి మంట తగ్గించి మగ్గించాలి.
4) కొంచెం సేపు తరువాత కారం వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి కూర బాగా ఇగిరిన తరువాత దించుకోవాలి.

రొయ్యలు - ములక్కాయ కూర * రుచి - అభిరుచి


కావలిసిన వస్తువులు:

రొయ్యలు                      :  ఒక కిలో
కారం                            :   6 స్పూనులు
ములక్కాయలు             :   13
ఉప్పు                           :  సరిపడా
ఉల్లిపాయలు                 :    పన్నెండు
గసగసాలు                    :  6 స్పూనులు
నూనె                           : 250 గ్రాములు
పోడి మసలా                   : 4 స్పూనులు
పచ్చిమిర్చి                      : పది
కొత్తిమీర                        :    4 కట్టలు
పసుపు                         :    కొంచెం

తయారుచేయు విధానం :  

1) రొయ్యలను వొలిచి శుభ్రంగా కడిగి వుంచుకొవాలి.
2) ములక్కయలు ఫై పీచు తీసి ముక్కలుగా కోసి వుంచుకోవాలి.
3)ఉల్లిపాయలు - పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వుంచుకోవాలి.
4) గసగసాలు ముద్దగా నూరుకోవాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత రొయ్యలు వెయ్యాలి.
6) అవి బాగా వేగిన తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
7) బాగా దోరగా వేగిన తరువాత ములక్కాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి ఒక పావుశేరు నీళ్ళు పోయాలి.
8) కొంచెం మగ్గిన తరువాత గసగసాల ముద్దా వెయ్యాలి.
9) పూర్తిగా ఇరిగిన  తరువాత కొంచెం గ్రేవీ  ఉంచుకొని పొడి మసాలా  కొత్తిమీరా వేసి దించుకోవాలి. 

ఎగ్ - 65


కావలిసిన వస్తువులు 

ఉడికించిన గుడ్లు    :  8
పంచదార              :  100 గ్రాములు 
కార్న్ ప్లోర్             : 100 గ్రాములు 
టమోటాలు           :   4
చిల్లీ సాస్               :  4  స్పూనులు 
ఉప్పు                  :    4  స్పూనులు 
పెరుగు                 :    రెండు కప్పులు 
నూనె                    :  100 గ్రాములు 
పచ్చి గుడ్లు            : 1
కరివేపాకు             :  కొంచెం 
ఆరంజి  కలర్           :  కొద్దిగా

తయారుచేయు విధానం :

1) ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసి ఒక పచ్చి గుడ్డును కొట్టి తగిన ఉప్పు , కార్న్ ప్లోర్ కలపాలి. 
2) నూనె లో వేపాలి. 
3) ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగిన తరువాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి  వేయించుకోవాలి. 
4) అందులో గుడ్ల ముక్కలు  వేయాలి. 
5) దానిలో పెరుగు,చిల్లీ సాస్,  టేస్టింగ్ పౌడర్, పెప్పర్ పౌడర్ ఆరంజ్ కలర్ వేసి మరిగాక దించాలి. 


వెన్నతో చేపల ఫ్రై

కావలిసిన వస్తువులు: 

కొరమీను చేపలు               :  అర కిలో
వెన్న                                : 50 గ్రాములు 
నూనె                                : 100 గ్రాములు
మిరియాల పొడి                  : ఒక చెంచా
నిమ్మకాయ                       : ఒకటి
ఉప్పు                               : సరిపడా

తయారుచేయు విధానం:

1)  కొరమీను చేపలలో ఒకే ఒక ముల్లు  ఉంటుంది. చేప ను కోసి ఆ ముల్లును తీసివేయాలి.
2)  చేపను చిన్న చిన్న ముక్క్కలుగా కోసుకోవాలి.
3)  ఆ ముక్కలను ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
4)   ఒక బాణలిలో నూనే పోసి బాగా కాగిన తరువాత ఆ  చేప ముక్కలను అందులో వేసి దోరగా వేయించాలి.
5)  దింపే ముందు కొత్తిమీర - వెన్న వేసి దించుకోవాలి.

నేతితో రొయ్యల వేపుడు



కావలిసిన వస్తువులు 

రొయ్యలు                         :  500 గ్రాములు
ఉల్లిపాయలు                    : 4
వెల్లుల్లి                             : సరిపడా
టమోటాలు                      : 3
సోపు                              : ఒక టీ స్పూను
పసుపు                           :  ఒక టీ స్పూను
నెయ్యి                             : 100 గ్రాములు
కరివేపాకు                        : సరిపడా
ఉప్పు                              : సరిపడా 

తయారుచేయు విధానం : 

1) రొయ్యలను వొలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
2) బాణలిలో నెయ్యి  బాగా కాగిన తరువాత సోపు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటాలు మరియు వెల్లుల్లి వేసి బాగా వేపాలి.
3) తరువాత రొయ్యలు, ఉప్పు, పసుపు పొడి వేసి కలపాలి.
4) కారంవేసి  బాగా కలిపి, వేగిన తరువాత దింపాలి.

ఆయిల్ లేని కోడికూర


కావలిసిన వస్తువులు 

చికెన్                   :    అరకిలో
కారం                   : ఒక స్పూను
అల్లం                   :  ఒక ముక్క
ఉల్లిపాయ             :   ఒకటి
పసుపు                :   ఒక స్పూను
వెన్న                   :   కొద్దిగా
మిరియాలు          :  ఆరు
ఉప్పు                  :   ఒక స్పూను
ధనియాలు           : అరస్పూను
కొత్తిమీరా              :    ఒక కట్ట

తయారుచేయు విధానం :

1) ఒక పాత్రలో నీళ్ళుపోసి చికెన్ ముక్కలను ఉడకపెట్టాలి.
2) కొంచెంసేపు అయిన తరువాత మిరియాలు, అల్లం, కారం,ధనియాలు పొడి మెత్తగా నూరుకోవాలి.
3) ఈ మిశ్రమాని ఉడుకుతున్న ముక్కల్లో వేసి తక్కువ మంట ఫై ఉడికించాలి.
4) ఒక బాణలిలో వెన్న వేసి బాగా కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కల్ని వేయించి చికెన్ ముక్కలో ఉప్పు, ఉల్లి ముక్కలు వేసి మరో పది నిముషాలు ఉడకపెట్టాలి.
5) దింపేముందు  కొత్తిమీరా వేసి దించుకోవాలి.

ఎగ్ టమోటా బాత్

కావలిసిన వస్తువులు: 
బియ్యం                                     : ఒక కేజీ
నూనె                                        : 200 గ్రాములు 

జీడిపప్పు                                  : 200 గ్రాములు
 గ్రుడ్లు                                        : 8
ఆవాలు                                     :   రెండు స్పూనులు
నెయ్యి                                       : 100 గ్రాములు
పచ్చిమిర్చి                                : 10
టమోటా                                    :   1/2 కేజీ
జీలకర్ర                                      : రెండు స్పూనులు
కొత్తిమీరా                                   : ఒక కట్ట


తయారుచేసే విధానం:
1) బియ్యాన్ని  కడిగి రెడీగా వుంచుకోవాలి.
2) పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి.
3) ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక తాలింపు దినుసులు - పచ్చిమిర్చి వేయించాలి.
4) అవి కొద్దిగా వేగాక టమోటా కూడా వేసి వేయించాలి.
5) అంతకు ముందు రెడీగా ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేయాలి.
6) ఉడికిన తరువాత దించేటప్పుడు జీడిపప్పు - కొత్తిమీరా వేసి దించుకోవాలి.
7) చివరగా పైన నెయ్యి వెయ్యాలి.

ఎగ్ పులిహోర

కావలిసిన వస్తువులు: 
బియ్యం                                     : ఒక కేజీ
నూనె                                        : 250 గ్రాములు
గ్రుడ్లు                                         : 8
వేరుశేనకాయ పప్పు                   :  200 గ్రాములు

 మినపప్పు                                : రెండు స్పూనులు
ఎండు మిర్చి                               : 20
ఉప్పు                                        : సరిపడా
చింతపండు                                : 250 గ్రాములు 

ఆవాలు                                     :   రెండు స్పూనులు
పసుపు                                     :   రెండు స్పూనులు
కరివేపాకు                                  :   సరిపడా


తయారుచేసే విధానం:

1) బియ్యాన్ని ఉడికించి, అందులో పసుపు వేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2) ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక అందులో తాలింపు దినుసులు, వేరుశనగ పప్పు వేసి బాగా వేయించాలి.
3) తరువాత దానిలో చిక్కగా తీసిన చింతపండు రసం వేసి ఉడికించాలి.
4) గ్రుడ్లులోని తెల్లని సొనను మాత్రమే దానిలో వేసి ఉడికిన బియ్యాన్ని కూడా వేసి ఉప్పు కలపాలి.

పెరుగుతో చికెన్


కావలిసిన వస్తువులు:
చికెన్                     :    ఒక కిలో 
పెరుగు                   :    ఆరు గ్లాసులు 
అల్లం                     :    పెద్దముక్క 
వెల్లుల్లి                    :   ఇరవై  రెబ్బలు 
ఉల్లి                        :   నాలుగు  
నూనె                     :   100 గ్రాములు 
కొత్తిమిరా                :   ఒక కట్ట 
గరం మసాలా         :   నాలుగు స్పూనులు 
పసుపు                 :    ఒక స్పూను
వేడినీళ్ళు              :    సరిపడా 
ఉప్పు                   :    సరిపడా 

తయారుచేసే విధానం:

1)  చికెన్ ని శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి.
2) ఉల్లిపాయలను కోసుకోవాలి.
3) అల్లం - వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి.
4) ఒక కళాయిలో నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు నీ వేయాలి.
5) ఇవి బాగా దోరగా వేగిన తరువాత కోసి ఉంచిన చికెన్ ముక్కలు వేయాలి.
6) ఇవి  ఇరిగాక నీళ్లు పోయాలి.
7) పెరుగులో పసుపు - ఉప్పు  కలపాలి. అందులో కొత్తిమీరా ముక్కలు వేయాలి.
8) గరం మసాలా కూడా కలపాలి.
9) ఈ  పెరుగును కళాయిలో వున్నా చికెన్ మిశ్రమంలో కలిపాలి.
10) బాగా కలిపి కొంచెం మగ్గాక దింపేయాలి.

చికెన్ కూర్మా





కావలసినవి:
చికెన్                    :      అర కిలో
పెరుగు                  :      ఒక కప్పు ( పుల్లగా )
నూనె                    :      50 గ్రాములు
ఉల్లి                       :       రెండు
వెల్లులి                   :       ఒక్కటి
గసగసాలు             :   రెండు స్పూన్లు
పసుపు                 :    కొంచెం
ధనియాలు            :    రెండు స్పూన్లు
మైదా                    :     50 గ్రాములు

చెక్క                     :      రెండు
లవంగాలు            :    మూడు
అల్లం                    :   చిన్నముక్క
ఉప్పు                   :  సరిపడా
కారం                    :  రెండు స్పూనులు
పచ్చిమిర్చి           :   నాలుగు
కొత్తిమీరా              :    ఒక్క కట్ట
తోక మిరియాలు    :  కొంచెం       

తయారుచేయు విధానం :
1) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2) పచ్చి సరుకంతా ఒక మసాలా గానూ, ఎండు సరుకంతా ఒక మసాలా గానూ నురుకోని ఉంచుకోవాలి.
3) చికెన్లో ఉప్పు, కారం, పసుపు పచ్చి మసాలా పట్టేలా బాగా కలపాలి.
4) ఇంకా అందులో పెరుగుపోసి బాగా కలపాలి.
5) ఒక బాణలిలో నూనె పోసి కాగాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత చికెన్ వేయాలి.
6) కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ముక్క బాగా ఉడకడానికి ఒక గ్లాసుడు నీళ్ళు పోయాలి.
7) నీళ్ళు ఇరిగిపోతుండగా చికెన్ కూడా ఉడుకుతుంది.
8) కొత్తిమీరా, మైదా, ఎండు మసాలా  వేసి బాగా కలిపి దించుకోవాలి.