నిమ్మ చారు


కావలిసిన వస్తువులు 

నిమ్మకాయలు             :   2
పచ్చిమిర్చి                  :   4
పసుపు                       :  సరిపడా
పోపులు                      :  సరిపడా
ఉప్పు                           :  సరిపడా

తయారుచేయు విధానం 

*  పచ్చిమిర్చి సన్నగా తరిగి ఆ ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు కలిపి  రెండు గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగించాలి.
*  ఒక బాణలిలో పోపులు వేసి వేయించి మరిగిన చారును పోసుకోవాలి.
*  చారు చల్లారక నిమ్మకాయలును కోసుకొని గింజలు లేకుండా రసం పిండుకోవాలి.
**   వేడిగా ఉన్న చారులో  నిమ్మరసం పిండకూడదు ,చేదు  వస్తుంది. 

No comments:

Post a Comment