కావలసినవి:
బాస్మతి బియ్యం : 2 కప్పులు
సెలెరీ తురుము : అరకప్పు
టొమాటో ముక్కలు : 1 కప్పు
ఉల్లికాడల తురుము : 1 కప్పు
జీడిపప్పు : 1 కప్పు
వేరుసెనగపప్పు : 1 కప్పు
గుమ్మడిగింజలు : 1 కప్పు
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : 2 టీస్పూన్లు
ఫ్రెంచ్ బీన్స్ : పావు కాప్పు
తయారుచేసే విధానం:
1. బాస్మతిబియ్యం కడిగి ఉడికించి పక్కన ఉంచాలి.
2. జీడిపప్పు, వేరుసెరుగ పప్పు, గుమ్మడిగింజలు విడివిడిగా నూనె లేకుండా వేయీంచి తీయాలి.
3. ఇప్పుడు కూరగాయలముక్కలన్నీ విడివిడిగా కొద్దిసేపు వేయించి తీయాలి. తరువాత వీటిని అన్నంలో కలపాలి. తరువాత సన్నగా తరిగిన ప్రెంచ్ బీన్స్ ముక్కలు, ఆవ మొలకలు వేసి కలపాలి.
4. చివరిగా వేయించిన నట్స్ కూడా వేసి తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లి దించాలి.