ఫ్రెంచ్ రైస్ సలాడ్


కావలసినవి:
బాస్మతి బియ్యం         :   2 కప్పులు    
సెలెరీ తురుము          : అరకప్పు 
టొమాటో ముక్కలు      :  1 కప్పు 
ఉల్లికాడల తురుము    : 1 కప్పు  
జీడిపప్పు                   : 1 కప్పు     
వేరుసెనగపప్పు           : 1 కప్పు   
గుమ్మడిగింజలు         : 1 కప్పు
ఉప్పు                       : తగినంత   
మిరియాల పొడి         :   2 టీస్పూన్లు  
ఫ్రెంచ్ బీన్స్               : పావు కాప్పు 


తయారుచేసే విధానం:
1. బాస్మతిబియ్యం కడిగి ఉడికించి పక్కన ఉంచాలి.
2. జీడిపప్పు, వేరుసెరుగ పప్పు, గుమ్మడిగింజలు విడివిడిగా నూనె లేకుండా వేయీంచి తీయాలి. 
3. ఇప్పుడు కూరగాయలముక్కలన్నీ విడివిడిగా కొద్దిసేపు వేయించి తీయాలి. తరువాత వీటిని అన్నంలో కలపాలి. తరువాత సన్నగా తరిగిన ప్రెంచ్ బీన్స్ ముక్కలు, ఆవ మొలకలు వేసి కలపాలి.
4. చివరిగా వేయించిన నట్స్ కూడా వేసి తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లి దించాలి.

జపనీస్ ఆనియన్ సూప్

కావలసినవి:                              

చికెన్ బోన్ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్ - ఒకటి ( పలుచని ముక్కలుగా కోయాలి)
సెలెరీకాడలు - రెండు
అల్లం తురుము - ఒకటిన్నర టీస్పూన్లు
మంచినీళ్లు - 3 కప్పులు 
ఉప్పు  -  తగినంత


తయారుచేసే విధానం:
1. చికెన్ బోన్, కూరగాయల ముక్కలు అన్నీ కుక్కరులో వేసి నీళ్లు పోసి ఉడికించాలి. రెండు మూడు విజిల్స్ వచ్చిన తరువాత సిములో పెట్టి మరో పది నిమిషాలు ఉంచాలి.
2. తరువాత మూత తీసి ఈ నీటిని పలుచని క్లాత్ లో వడబోయాలి. ముక్కలన్నీ తీసేసి సూప్ లో తగినంత ఉప్పు వేసి వేడివేడిగా అందించాలి.