పాలకోవా


కావలిసిన వస్తువులు 

పాలు                              :   ఒక లీటర్
పంచదార                        :   1/4 కేజీ
నెయ్యి                             :   కొద్దిగా

తయారుచేయు విధానం 

*  పాలను  సన్నని సెగ మీద గరిటతో కలుపుతూ సుమారు గంట సేపు కాగనివ్వాలి.
*  పాలు  చిక్కబడి ముద్దగా అవుతుండగా పంచదారను పోసి మళ్ళి  కలుపుకోవాలి.
*  పంచదార కరిగి పల్చగా అయి తరువాత కోవా గట్టి పడుతుంది.
*  అంచులు ఉన్న పళ్ళానికి నెయ్యి పూసి అందులోనికి కోవా పోసుకోవాలి.
*  దానిని కొద్ది సేపు మెత్తగా నూరుకోవాలి.  కోవా రెడీ. 

చికెన్ పకోడి


కావలిసిన వస్తువులు 

చికెన్                        :   750 గ్రాములు
శనగపిండి                 :   600 గ్రాములు
తాజా నిమ్మరసం       :    4 స్పూనులు
కారం                        :    రెండు స్పూనులు
ఆవాల పొడి               :    3 స్పూనులు
వెనిగర్                      :     1 స్పూను
అజినోమాటో              :      1 స్పూను
నెయ్యి                       :      250  గ్రాములు
ఉప్పు                        :    సరిపడా

తయారుచేయు విధానం 

*   చికెన్ ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పోర్క్ తో బాగా పొడిచి ఉప్పు   కారం ఆ ముక్కలకు పట్టేలా చెయ్యాలి.
*   మిగిలిన పొడి మసాలలన్ని  ఆ ముక్కలకి కలిపి పైన నిమ్మరసం  వెనిగర్ చల్లి బాగా కలిపి రెండు గంటలపాటు ఊరనివ్వాలి.
*  శనగపిండి లో  కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని కొంచెం పలుచగా కలుపుకోవాలి.
*  ఊరిన చికెన్ ముక్కలను పిండేసి వేరే గిన్నెలో వేసుకోవాలి.
*  మొదట గిన్నెలో మిగిలిన మసాలలన్ని సెనగపిండి కలిపెయ్యాలి.
*  నెయ్యిని  బాగా కాచి చికెన్ ముక్కలిని పిండిలో ముంచి నేతిలో వేపాలి.
*  సగం వేగాక సన్న సెగ చేసి బాగా వేయించాలి. 

ఉగాది పచ్చడి


కావలసిన వస్తువులు : 

వేప పువ్వు                       : 1కప్పు
బెల్లంపొడి                          : 1కప్పు
కొబ్బరికోరు                       : 1కప్పు
బాగాముగ్గిన అరటి పండ్లు   :  6
మామిడికాయ                   :  1
కొత్తకారము                       :  చిటెకెడు
ఉప్పు                                 :  అరస్పూను
శనగ పప్పు పొడి                  :  1కప్పు
చింతపండు                         : నిమ్మకాయంత
వేయించిన వేరుశనగపప్పు     : అర కప్పు

తయారుచేయు విధానం

*  చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి.
*  అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా కోసుకోవాలి.
*  మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి.
*   చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి.
*   వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.


శ్రీ విజయనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ వీక్షకులకు, సందర్శకులకు  విజయనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు