చికెన్ - చింతచిగురు


కావలిసిన వస్తువులు 

చికెన్                            :   అర కిలో
చింత చిరురు                 :   పావు కిలో
నూనె                           :    50 గ్రాములు
కారం                           :     రెండు స్పూనులు
ఉల్లిపాయలు                  :   4
దాల్చిన చెక్క                 :   కొద్దిగా
లవంగాలు                     :   4
పచ్చిమిర్చి                    :   4 కాయలు
ఉప్పు                             :  సరిపడా

తయారుచేయు విధానం 

*  చికెన్ ని ముక్కలుగా కోసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి.
*  చింత చిగురు కాడలు లేకుండా ఆకులను బాగా నలిపి ఉంచుకోవాలి.
*  ఉల్లిపాయలను, పచ్చిమిర్చి ముక్కలుగా  కోసుకొవాలి.
*  ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగాక దాల్చినాచెక్క , లవంగాలు వేయాలి.
*  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగిన తరువాత చికెన్ ముక్కలు వేయాలి.
*  అది కూడా ఇరిగాక ఉప్పు - కారం వేసి అరా లీటరు నీళ్ళు పోసి మూత పెట్టాలి.
*  కొంచెం నీళ్ళు  వుండగానే  చింతచిగురు వేసి బాగా ఇరిగాక దించుకోవాలి. 

No comments:

Post a Comment